నారాయణవనం: విద్యార్థిపై సీనియర్ల దాడి

3031చూసినవారు
నారాయణవనం: విద్యార్థిపై సీనియర్ల దాడి
అన్నమయ్య జిల్లాకు చెందిన ఒక విద్యార్థిపై నారాయణవనం మండలంలోని ఓ కళాశాలలో ఆరుగురు సీనియర్ విద్యార్థులు దాడి చేసిన సంఘటన శనివారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థికి, అదే కళాశాలలో చదువుతున్న ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అమ్మాయికి ముందే పరిచయం ఉన్న సీనియర్ విద్యార్థి, వారి చాటింగ్ గురించి తెలుసుకుని, ఈ నెల 20వ తేదీ రాత్రి హాస్టల్ గదికి పిలిచి, తన స్నేహితులతో కలిసి విద్యార్థిపై విచక్షణారహితంగా దాడి చేసి, వీడియోలు తీశాడు. మరుసటి రోజు, 21వ తేదీన, క్షమాపణ చెబుతామని పిలిచి మరోసారి దాడి చేశారు.

సంబంధిత పోస్ట్