పుంగనూరు లో మున్సిపల్ అధికారిని నిలదీసిన ప్రజలు

4చూసినవారు
అన్నమయ్య జిల్లా, పుంగనూరులోని టిడ్కో ఇళ్ల వద్ద పారిశుధ్యం లేకపోవడం, రాత్రిపూట విద్యుత్ దీపాలు పనిచేయకపోవడంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం రాత్రి స్థానికులు మున్సిపల్ అధికారి రవిని నిలదీశారు. టిడ్కో ఇళ్ల వద్ద పారిశుధ్య లోపంపై పలుమార్లు అధికారులకు వినతులు ఇచ్చినా చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. ఈ సమస్యల వల్ల తాము నరకయాతన అనుభవిస్తున్నామని వాపోయారు.

ట్యాగ్స్ :