పుంగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని NSS విద్యార్థులకు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు మంగళవారం అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. యంత్రాల ద్వారా అగ్ని ప్రమాదాలను ఎలా నివారించాలో ప్రయోగాత్మకంగా వివరించారు. అగ్ని ప్రమాదాలు జరిగిన వెంటనే 101కి సమాచారం ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు NSS ప్రత్యేక శిబిరంలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గంగాధర్ నాయుడు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.