పుంగనూరు: ఎస్పీ ఆదేశాలతో క్లూస్ టీం పరిశీలన

2065చూసినవారు
పుంగనూరు: ఎస్పీ ఆదేశాలతో క్లూస్ టీం పరిశీలన
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో ఐదు సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్న అబ్రార్ అనే వ్యక్తి, తనతో ఉంటున్న మహిళపై దాడి చేసి, ఇంట్లోని ఫ్రిడ్జ్, బీరువా, టీవీ వంటి వస్తువులను ధ్వంసం చేసి, చంపుతానని బెదిరించిన ఘటన కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు, జిల్లా ఎస్పీ ధీరజ్ కునబిల్లి ఆదేశాల మేరకు గురువారం క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకొని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి, నమూనాలను సేకరించింది. ఈ కార్యక్రమంలో ఎస్సై కె.వి. రమణ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్