పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం రాంపల్లి గ్రామానికి చెందిన 21 ఏళ్ల రామ్ చరణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటనతో తీవ్ర దుఃఖంలో ఉన్న మృతుడి కుటుంబ సభ్యులు, తమ ఇంటికి ఆధరువుగా ఉన్న రాంచరణ్ చనిపోవడంతో తమను అధికారులు ఆదుకోవాలని, ఈ ఘటనకు బాధ్యుడైన పిచ్చాటూరుకు చెందిన అరుణ్ కుమార్ కు తగిన శిక్ష పడాలని బుధవారం రాత్రి విజ్ఞప్తి చేశారు.