పుంగనూరు: మామిడి చెట్లను ధ్వంసం చేసిన ఏనుగులు

6చూసినవారు
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలో బుధవారం ఉదయం ఒక ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. ఈ ఏనుగు చిన్న నగరి, దిగుమూర్తి వారిపల్లి గ్రామాలకు చెందిన భూలక్ష్మమ్మ, చిన్నప్ప, హైమావతి అనే రైతుల మామిడి చెట్లను ధ్వంసం చేసింది. అనంతరం ఏనుగు అడవిలోకి వెళ్లిపోయింది. ఈ సంఘటనతో నష్టపోయిన రైతులు ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :