పుంగనూరు: చౌడేపల్లి మండలంలో అగ్నిప్రమాదం

6చూసినవారు
పుంగనూరు: చౌడేపల్లి మండలంలో అగ్నిప్రమాదం
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, కాగతి గ్రామంలో శుక్రవారం రాత్రి శారదమ్మకు చెందిన చిల్లర దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఇల్లు మొత్తం వ్యాపించడంతో, శారదమ్మ, ఆమె కుమారుడు ఉదయ్ కుమార్ తృటిలో తప్పించుకున్నారు. ప్రమాద సమయంలో ఇంటి ముందున్న వివేక్ వాహనం పేలింది. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కానున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you