పుంగనూరు: అగ్నిప్రమాదంలో ఐదు లక్షల మేర నష్టం

2చూసినవారు
పుంగనూరు: అగ్నిప్రమాదంలో ఐదు లక్షల మేర నష్టం
శుక్రవారం రాత్రి పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, కాగతి గ్రామంలో అగ్నిప్రమాదం జరిగింది. ఇంటి ముందు పార్క్ చేసిన హీరో స్ప్లెండర్ ద్విచక్ర వాహనంలో మంటలు వ్యాపించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంతో పాటు విద్యుత్ మీటరు, ఇంటి ముందు సీలింగ్, కిటికీలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ ఘటనలో సుమారు ఐదు లక్షల మేర నష్టం సంభవించిందని ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్