పుంగనూరు: ఆ టెస్టులో పాజిటివ్ ఫలితం వస్తే చర్యలు తప్పవు: సీఐ

7చూసినవారు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు సీఐ సుబ్బరాయుడు గంజాయి సేవించే వారికి శనివారం రాపిడ్ డ్రగ్ కిట్ల ద్వారా మూత్ర పరీక్షలు నిర్వహించారు. గంజాయి సేవించినట్లు పరీక్షల్లో తేలితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు అన్సర్ భాష, కె. వి. రమణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.