శనివారం ఉదయం పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, పెద్ద ఉప్పరపల్లి సమీపంలోని ఓ పెట్రోల్ బంకులో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ ద్విచక్ర వాహనాలకు నీరు కలిసిన పెట్రోల్ పట్టారని, దీంతో వాహనాలు నిలిచిపోయాయని బాధితులు తెలిపారు. బంకు సిబ్బంది శుక్రవారం స్టాక్ వచ్చిందని సమాధానం ఇచ్చారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు.