పుంగనూరు: నల్ల బ్యాడ్జీలతొ నిరసన తెలిపిన జూనియర్ లైన్మెన్ లు

73చూసినవారు
పుంగనూరు ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు జూనియర్ లైన్మెన్ లు సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ జూనియర్ లైన్మెన్లను పాత సర్వీస్ రూల్స్ ప్రకారం అసిస్టెంట్ లైన్మెన్ లుగా పదోన్నతి కల్పించాలని, తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. తమని డిపార్ట్మెంట్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్