పుంగనూరు: చోరీకి వచ్చాడని అనుమానంతో వ్యక్తికి దేహశుద్ధి

9చూసినవారు
పుంగనూరు: చోరీకి వచ్చాడని అనుమానంతో వ్యక్తికి దేహశుద్ధి
పుంగనూరు మండలం, దిగువపల్లి గ్రామంలో బోరు బావుల వద్ద కేబుల్ వైర్లు దొంగిలించే ప్రయత్నం చేస్తున్నాడనే అనుమానంతో శనివారం రాత్రి రామసముద్రం మండలం, తిరుమలరెడ్డి పల్లి గ్రామానికి చెందిన బాబా సాహెబ్ (32)ను గ్రామస్తులు కర్రలతో, కేబుల్ వైర్లతో చితకబాదారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి స్పృహ తప్పి పడిపోవడంతో స్థానికులు అతన్ని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్