చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణంలో మంగళవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయిన మైనర్ బాలిక కోసం కుటుంబ సభ్యులు గాలించారు. ఫలితం లేకపోవడంతో, బాలిక సోదరుడు మహేష్ బుధవారం పోలీసులను ఆశ్రయించారు. ఎస్సై కె.వి. రమణ మైనర్ బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడి కానున్నాయి.