పుంగనూరు మండలం సింగిరిగుంట గ్రామ సమీపంలో వ్యవసాయ పొలంలో పనులు చేసుకుంటున్న చంద్రారెడ్డి, భారతమ్మ, సుబ్రహ్మణ్యం రెడ్డిలపై అదే గ్రామానికి చెందిన మునిరాజ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి దాడి చేశారు. ఈ ఘటనలో భారతమ్మ, చంద్రారెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. గాయపడ్డ వ్యక్తులు తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు.