పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం, పెద్దపంజాణి మండలం, శ్రీరామపురం సమీపంలోని బసాపురం క్రాస్ వద్ద గంజాయి తరలిస్తున్న పుంగనూరు మండలం భగత్ సింగ్ కాలనీకి చెందిన శివ భార్య శ్యామలను, శంకర్ రాయలపేట గ్రామానికి చెందిన మస్తాన్ ను ఎమ్మార్వో హనుమంతు, ఎస్సై మారెప్ప తమ సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి సుమారు రూ. 31,500 విలువైన రెండు కిలోల 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.