చిత్తూరు జిల్లా, పుంగనూరు నుంచి రామసముద్రం వెళ్లే మార్గంలో పుంగమ్మ చెరువు కట్టపై రోడ్డుపై ఏర్పడిన పెద్ద గుంతల వల్ల ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇతర వాహనాలు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని సీపీఐ నాయకులు వెంకటరమణారెడ్డి సోమవారం తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి రామ్మూర్తి కూడా పాల్గొన్నారు.