చిత్తూరు జిల్లా, పుంగనూరు, సోమల లోని జూనియర్ కళాశాలల్లో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బుధవారం సోమల ఎస్ కె వి ఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు నడింపల్లి గ్రామంలో ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే అనర్థాలు, సహజ ఎరువులపై అవగాహన కల్పించారు. మంగళవారం పుంగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు మంగళం కాలనీలో 'డ్రగ్స్ పై అవగాహనా ర్యాలీ' నిర్వహించి, మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.