పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న కార్తిక అనే విద్యార్థిని అక్టోబర్ 29న అస్వస్థతకు గురైంది. స్థానిక సీహెచ్‌సీలో చికిత్స అనంతరం తిరుపతికి తరలించగా, డయాలసిస్ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. ఈ సంఘటనతో బాలిక కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.