చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మార్వో కార్యాలయంలో తహసిల్దార్ రాము అధ్యక్షతన మంగళవారం ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మానిటరింగ్ కమిటీ సభ్యుడు రాజు మాట్లాడుతూ, దళితులకు కేటాయించిన స్మశాన వాటికను చెరువుల వద్ద ఏర్పాటు చేయడం వల్ల వర్షపు నీరు చేరి అంత్యక్రియలకు ఇబ్బందులు పడుతున్నామని, దళితుల సమస్యలను అధికారులు పరిష్కరించాలని కోరారు.