పుంగనూరు: ఎందుకమ్మా నేనంటే నీకు అంత కోపం

10చూసినవారు
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలోని ఎస్. నడింపల్లి గ్రామ సమీపంలో మంగళవారం అప్పుడే పుట్టిన ఆడ శిశువును ముళ్ళపొదల్లో గుర్తు తెలియని వ్యక్తులు పడేశారు. స్థానికులు కేకలు విని వెళ్లి చూడగా పసికందు క్షేమంగానే ఉంది. వెంటనే ఐసిడిఎస్ అధికారులకు సమాచారం అందించగా, వారు శిశువును స్థానిక పిహెచ్సికి తరలించి, అనంతరం చిత్తూరు సిసివిహార్ కు తరలించారు. ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్