అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో గురువారం దుప్పుల గుంపు టమోటా పంటపై దాడి చేసి రైతు రాసేట్టి రవికుమార్‌కు అపార నష్టం కలిగించింది. సుమారు 20 నుంచి 25 కుంటల విస్తీర్ణంలో సాగు చేసిన టమోటా పంటను దుప్పులు పూర్తిగా నాశనం చేశాయని, చేతికి వచ్చిన పంటను తినేయడంతో తనకు తీవ్ర నష్టం జరిగిందని బాధితుడు తెలిపారు. అధికారులు తనను ఆదుకోవాలని ఆయన వేడుకుంటున్నారు.