అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలం, వెంగళపల్లి పంచాయతీ, దాసరయ్యగారిపల్లి గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు టమోటా పంటను ధ్వంసం చేసిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. స్థానిక రైతు అంజలి తన వ్యవసాయ భూమిలో సుమారు 400 టమోటా మొక్కలతో పంట సాగు చేశారు. పంట కోసం సుమారు రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు ఆమె తెలిపారు. కోత దశకు చేరుకున్న టమోటా పంటను ధ్వంసం చేయడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.