సోమలలో పట్టు వస్త్రాలు సమర్పించిన టిటిడి బోర్డు మెంబర్

11చూసినవారు
సోమలలో పట్టు వస్త్రాలు సమర్పించిన టిటిడి బోర్డు మెంబర్
సోమల మండలానికి సమీపంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల ఆలయంలో శుక్రవారం మొలకల పౌర్ణమి సందర్భంగా భూనీలా దేవి సమేత పరుష వెంకటేశ్వర స్వామికి టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు పాగొండ వేణుగోపాల్ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామివారి కల్యాణోత్సవం అనంతరం ఆయనకు ధర్మకర్తలు మునెయ్య, చిన్నబాబు, పెద్దబాబు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ట్యాగ్స్ :