పుంగనూరు రోడ్డు ప్రమాదంపై అప్డేట్

11చూసినవారు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నూతన బైపాస్ జే టోన్ మలుపు వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చెంబుకూరు హరిజనవాడకు చెందిన ఆటో డ్రైవర్ రెడ్డప్ప మృతి చెందగా, 11 మందికి గాయాలయ్యాయి. వీరపల్లి నల్ల గంగమ్మను దర్శించుకుని చెంబుకూరు వెళ్తున్న ఆటోను, పలమనేరు నుంచి మదనపల్లి వెళుతున్న కారు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :