Feb 27, 2026, 01:02 IST/
ఎలాంటి గ్యారెంటీ అవసరం లేకుండానే రూ.1.25 లక్షల లోన్!
Feb 27, 2026, 01:02 IST
దేశంలో తక్కువ ఆదాయ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంలో మైక్రోఫైనాన్స్ రుణాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సాధారణ బ్యాంకుల నుంచి రుణాలు పొందలేని వారికి ఇవి ప్రత్యేకంగా ఉపయోగపడుతున్నాయి. చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి, అత్యవసర ఖర్చులు, పిల్లల విద్యా ఫీజుల కోసం ఈ రుణాలను వినియోగిస్తున్నారు. వార్షిక ఆదాయం రూ.3 లక్షల వరకు ఉన్న కుటుంబాలు ఎటువంటి పూచీకత్తు లేకుండా ఈ రుణాలకు అర్హులు. రుణ పరిమితి రూ.10,000 నుంచి రూ.1.25 లక్షల వరకు, తిరిగి చెల్లింపు కాలం ఒకటి నుంచి మూడు సంవత్సరాలుగా ఉంటుంది.