Apr 09, 2026, 08:04 IST/
జగిత్యాల: బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధం.. జీవన్ రెడ్డి ప్రకటన
Apr 09, 2026, 08:04 IST
తాను BRSలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని, తప్పకుండా ఆ పార్టీలోనే చేరుతున్నట్లు జీవన్ రెడ్డి ఈరోజు ప్రకటించారు. పార్టీ నిర్ణయాల మేరకే ముందుకు సాగుతానని, తనకు ఏ పదవి ఇచ్చినా బాధ్యతగా నిర్వహించేందుకు సిద్ధమని తెలిపారు. ప్రజల సేవే తన లక్ష్యమని, ఏ పార్టీలో ఉన్నా ప్రజల పక్షానే పనిచేస్తానని స్పష్టం చేశారు. కాగా ఈ నిర్ణయంతో స్థానిక రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.