పుత్తూరు మండలం - Puttur Mandal

జగిత్యాల జిల్లా
జగిత్యాల: మైనర్ బాలుడు ట్రాక్టర్ కిందపడి మృతి
May 15, 2026, 17:05 IST/జగిత్యాల
జగిత్యాల

జగిత్యాల: మైనర్ బాలుడు ట్రాక్టర్ కిందపడి మృతి

May 15, 2026, 17:05 IST
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలికొండ గ్రామంలోని ఎస్ఎస్ఎల్ బ్రిక్స్ ఇటుక బట్టీలో శుక్రవారం ఒడిశాకు చెందిన ఛబిలా దర్నా (17) అనే మైనర్ బాలుడు ట్రాక్టర్ నడుపుతూ ప్రమాదానికి గురై మృతి చెందాడు. ఫ్లై యాష్ తరలిస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి అతని మీదుగా వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మైనర్కు ట్రాక్టర్ నడిపేందుకు అనుమతి ఇచ్చిన యాజమాన్యం నరుకుల శ్రీనివాస్ నిర్లక్ష్యమే కారణమని మృతుడి బంధువు జుగేశ్వర్ మాఝి ఫిర్యాదు చేశారు. కొడిమ్యాల ఎస్సై సందీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.