Mar 13, 2026, 10:03 IST/
త్వరలో నటి అనుష్క పెళ్లి..!
Mar 13, 2026, 10:03 IST
టాలీవుడ్ నటి అనుష్క శెట్టి (44) ఈ ఏడాది వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆమె కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఓ వ్యాపారవేత్తతో ఆమె వివాహం నిశ్చయమైనట్లు సమాచారం. ఇరు కుటుంబాల అంగీకారంతోనే ఈ సంబంధం ఖరారైందని తెలుస్తోంది. గతంలో అనేక పుకార్లు వచ్చినప్పటికీ, ఈసారి మాత్రం వివాహం ఖాయమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై అనుష్క టీమ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.