Mar 06, 2026, 15:03 IST/
దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరాపై ఆంక్షలు విధించిన కేంద్రం
Mar 06, 2026, 15:03 IST
ఇరాన్–ఇజ్రాయిల్, అమెరికా మధ్య యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరాపై తాత్కాలిక ఆంక్షలు విధిస్తూ ఎల్పీజీని ప్రధానంగా గృహ వినియోగదారులకు మాత్రమే ప్రాధాన్యంగా సరఫరా చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ఐవోసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్కు ప్రత్యేక సూచనలు జారీ చేసినట్లు సమాచారం. ఈ ఆదేశాలతో పరిశ్రమలకు గ్యాస్ సరఫరాను పరిమితం చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.