రేణిగుంట మండలం - Renigunta Mandal

జగిత్యాల జిల్లా
దుబాయ్ విమానాశ్రయాల్లో పరిమిత సర్వీసులు ప్రారంభం
Mar 02, 2026, 15:03 IST/

దుబాయ్ విమానాశ్రయాల్లో పరిమిత సర్వీసులు ప్రారంభం

Mar 02, 2026, 15:03 IST
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో విమానాశ్రయాలు మూసివేయడంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో, దుబాయ్ గుడ్‌న్యూస్ చెప్పింది. సోమవారం సాయంత్రం నుంచి దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, దుబాయ్ వరల్డ్ సెంట్రల్-అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DWC) నుంచి పరిమిత స్థాయిలో విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఎమిరేట్స్, ఎతిహాద్ విమానాలు నడపనున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రతీకార దాడులు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. సోమవారం సాయంత్రానికి పరిస్థితులు చక్కబడుతుండటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకుంటున్నారు.