Jan 25, 2026, 10:01 IST/
బీఆర్ఎస్ పార్టీలో చేరికలు
Jan 25, 2026, 10:01 IST
సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం పిటి వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ దెబ్బేట భాస్కర్, పాలకవర్గ సభ్యులు మాజీ మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి, అన్ని వర్గాలకు న్యాయం కేసీఆర్ నాయకత్వంలోనే జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చడంలో విఫలమైందని, గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని మండిపడ్డారు.