Dec 09, 2025, 18:12 IST/
నాణేల చెల్లుబాటుపై RBI హెచ్చరిక: పుకార్లను నమ్మవద్దని ప్రజలకు సూచన
Dec 09, 2025, 18:12 IST
2016 నుంచి కరెన్సీ ముద్రణ, ఉపసంహరణ, రద్దు వంటి అంశాలు చర్చలో ఉండగా, తాజాగా నాణేల ముద్రణ నిలిచిపోయిందన్న పుకార్లు విస్తరించాయి. దీనిపై RBI స్పందిస్తూ, ఈ తప్పుదారి పట్టించే సమాచారాన్ని నమ్మవద్దని హెచ్చరించింది. రెండు రూపాయల నాణెం చెలామణిలో లేదని, ఒక రూపాయి నాణెం నకిలీదని, 50 పైసల నాణెం రద్దైందని వస్తున్న వాదనలు తప్పేనని స్పష్టం చేసింది. నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించింది.