Apr 24, 2026, 17:04 IST/
గుజరాత్‌పై RCB ఘన విజయం
Apr 24, 2026, 17:04 IST
సొంత మైదానంలో గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. విరాట్ కోహ్లి (81), దేవదత్ పడిక్కల్ (55) అర్ధశతకాలతో రాణించడంతో RCB సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదిస్తుందని భావించారు. అయితే, వీరిద్దరూ ఔటైన తర్వాత వచ్చిన పాటీదార్ (8), జితేశ్ (10) పరుగులు చేసే క్రమంలో త్వరగా ఔటయ్యారు. దీంతో మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా మారింది. చివరికి డేవిడ్, కృనాల్ బౌండరీలతో RCB విజయాన్ని ఖాయం చేశారు.