Jan 23, 2026, 17:01 IST/
చిరు వ్యాపారులకు స్వనిధి క్రెడిట్ కార్డులు
Jan 23, 2026, 17:01 IST
వీధి వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం ‘స్వనిధి క్రెడిట్ కార్డు’లను అందుబాటులోకి తెచ్చింది. పీఎం స్వనిధి స్కీమ్‌లో భాగంగా రెండో విడత రుణం తీసుకుని సకాలంలో చెల్లించిన వ్యాపారులకు ఈ క్రెడిట్ కార్డు ఇస్తారు. ఇది UPI లింక్డ్ రూపే క్రెడిట్ కార్డు. మ్యాగ్జిమమ్ లిమిట్ రూ.30వేలు. వ్యాలిడిటీ 5ఏళ్లు ఉంటుంది. కార్డు కోసం లోన్ ఇచ్చిన బ్యాంకులో సంప్రదించాలి. ఈ పథకాన్ని ఏపీలోని తిరుపతి జిల్లాలో తొలుత పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు.