
శ్రీసిటీలో రూ. 445 కోట్ల పెట్టుబడి.. 1, 250 జాబ్స్.!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, శ్రీసిటీలో ఎయిర్ కండిషనర్లు, వాటి విడిభాగాల తయారీ యూనిట్ ఏర్పాటుకు అంబర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా లిమిటెడ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పరిశ్రమ రూ. 445 కోట్ల పెట్టుబడితో స్థాపించబడుతుంది, దీని ద్వారా 1,250 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ తయారీ విధానం – 4.0 (2024–29) కింద దీనిని భారీ ప్రాజెక్టుగా గుర్తించి, ప్రభుత్వం ప్రోత్సాహకాలను మంజూరు చేసింది.





































