నాగలాపురం వేదనారాయణ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలు అందించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని రాజేష్ ఆకాంక్షించారు.