గురువారం వరదయ్య పాలెం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఇటీవల మరణించిన నెలవాయి గ్రామానికి చెందిన ఎన్. హరి 11వ రోజు కర్మక్రియలు జరిగాయి. ఆయన స్నేహితులు హరి జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు.