సత్యవేడు: తప్పిన పెను ప్రమాదం;బస్సుపై కూలిన కరెంట్ స్తంభం

9చూసినవారు
తిరుపతి జిల్లాలో మంగళవారం ఉదయం ఒక పెద్ద ప్రమాదం తప్పింది. వెంగారెడ్డి కండ్రిగ నుంచి ఉద్యోగులను తీసుకుని అపాచీకి వెళ్తున్న బస్సు వరదయ్యపాలెం జడ్పీ స్కూల్ వద్దకు చేరుకోగానే కరెంట్ స్తంభం విరిగి బస్సుపై పడింది. అపాయాన్ని ముందుగానే గమనించిన ఉద్యోగులు వెంటనే బస్సు దిగి పరుగులు తీయడంతో ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందిన వెంటనే విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :