శ్రీసిటిలో నిర్వహించిన జీఎస్టీ 2.0 అవగాహన సదస్సులో ఏపీ గుంటూరు అదనపు కమిషనర్ పి. ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, జీఎస్టీ 2.0 భారతదేశ పరోక్ష పన్నుల వ్యవస్థకు ఒక రీసెట్‌లాంటిదని తెలిపారు. దీని ద్వారా పన్ను రేట్ల సరళీకరణతో పాటు కఠినమైన నిబంధనలు అమలవుతాయని, వివాదాల పరిష్కార విధానం వేగవంతమవుతుందని పేర్కొన్నారు. ఆడిటర్ల పాత్ర కేవలం తనిఖీలకే పరిమితం కాకుండా, సలహాదారులుగా, రిస్క్ మేనేజ్‌మెంట్, డిజిటల్ అనుసరణలో కీలక బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుందని వివరించారు.