శుక్రవారం నాగలాపురం మండల పరిషత్ కార్యాలయ ఎంపీడీవోగా గుణశేఖర్ రాజు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఏవోగా పనిచేసిన ఆయన పదోన్నతిపై ఈ స్థానానికి నియమితులయ్యారు. గతంలో ఎంపీడీవోగా ఉన్న బాలాజీ నాయక్ నగరి మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. నూతన ఎంపీడీవో గుణశేఖర్ రాజు మండల అభివృద్ధికి, ప్రభుత్వ పథకాల అమలుకు కృషి చేస్తానని తెలిపారు.