సత్యవేడు: సమష్టిగా మండల అభివృద్ధికి కృషి చేద్దాం

5చూసినవారు
సత్యవేడు: సమష్టిగా మండల అభివృద్ధికి కృషి చేద్దాం
గురువారం పిచ్చాటూరు ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ, అధికారులు, ప్రజా ప్రతినిధులు సమిష్టిగా మండల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకం కింద మండలంలోని పంచాయతీలకు రూ. 20 లక్షల చొప్పున మంజూరైన నిధులు, చేపట్టాల్సిన పనుల వివరాలను ఎంపీడీఓ మహమ్మద్ రఫీ ద్వారా అడిగి తెలుసుకున్నారు. నిధులు విడుదలైన వేలూరు, నీరువాయి పంచాయతీలలో పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

ట్యాగ్స్ :