నాగలాపురం మండలంలోని సురుటుపల్లి ఆలయ ఛైర్మన్‌గా మద్యం కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని నియమించడంపై సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలయ ఈవో లతను ప్రశ్నిస్తూ, ఛైర్మన్ పదవికి నోటిఫికేషన్ విడుదలయ్యాక దరఖాస్తుదారుల విచారణ ఎందుకు జరపలేదని, తన పేరును ఎందుకు తొలగించారని ఎమ్మెల్యే నిలదీశారు. ఈ విషయంపై అసెంబ్లీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.