నారాయణవనం మండలం బ్రాహ్మణ తాంగల్ పంచాయతీలోని వడ్డీ ఇండ్ల ఎస్టీ వాసులు శవాలను పూడ్చడానికి పడుతున్న ఇబ్బందులను సోమవారం బీఎస్పీ నాయకుడు ధన ఆధ్వర్యంలో తహశీల్దార్ కు వినతి పత్రం ద్వారా తెలియజేశారు. ఈ సమస్యపై స్పందించిన తహశీల్దార్, స్మశానాన్ని సర్వే చేసి ఎస్టీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.