వరదయ్యపాలెం మండలం లక్ష్మీపురం గ్రామంలో మంగళవారం ఉదయం ఎవరూ నివసించని ఇంట్లో హరి (31) అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, మృతుడు వివాహితుడని, పిల్లలు లేరని తెలిపారు. మరణం అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.