సత్యవేడు: పారదర్శక కోసమే కొత్తగా ఈ పాస్ పుస్తకాలు పంపిణీ

9చూసినవారు
సత్యవేడు: పారదర్శక కోసమే కొత్తగా ఈ పాస్ పుస్తకాలు పంపిణీ
భూహక్కుల ప్రక్రియలో పారదర్శకతను తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం క్యూఆర్ కోడ్ తో కూడిన కొత్త ఈపాస్ పుస్తకాలను పంపిణీ చేస్తోంది. శుక్రవారం తిరుపతి జిల్లా సత్యవేడు మండల పరిధిలోని మదనంజేరి గ్రామంలో స్థానిక తహసిల్దార్ రాజశేఖర్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ఈ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి, జడ్పిటిసి విజయలక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కొత్త విధానం భూ లావాదేవీలలో పారదర్శకతను పెంచుతుందని భావిస్తున్నారు.