సత్యవేడు: మరుగుదొడ్లు లేక బాలికలు అవస్థలు

9చూసినవారు
సత్యవేడు: మరుగుదొడ్లు లేక బాలికలు అవస్థలు
కేవీబీపురం మండలంలోని సదాశివపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికలకు మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూత్ర విసర్జన అవసరాలకు కూడా బాలికలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, పాఠశాల విద్యా కమిటీలు బాలికల మరుగుదొడ్ల ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వెంటనే స్పందించి బాలికల కోసం మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్