శ్రీకాళహస్తి మండలంలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ గిరిజనుల సమస్యలపై 'కొత్త కోణం' అనే పేరుతో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారికి అందాల్సిన హక్కులు, ప్రభుత్వం కేటాయించిన పథకాలపై అవగాహన లేని వారికి పూర్తిస్థాయిలో వివరించారు.