శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో మృత్యుంజయ స్వామికి సోమవారం నాడు విశేష అభిషేకం నిర్వహించారు. స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం స్వామి వారిని పూలమాలలతో అలంకరించి, అర్చకులు పుష్పాలతో అర్చన చేసి హారతి సమర్పించారు.