శ్రీకాళహస్తిలో ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవం

3చూసినవారు
శ్రీకాళహస్తిలో ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవం
శ్రీకాళహస్తి పట్టణంలో శుక్రవారం ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏరియా కార్యదర్శి మల్లికార్జున్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్, నంది సర్కిల్ ఆటో స్టాండ్, టూ టౌన్ హైవే ఆటో స్టాండ్, సివిల్ సప్లై గోడౌన్ తదితర ప్రాంతాల్లో ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించారు. దేశ కార్మిక ఉద్యమ చరిత్రలో ప్రాధాన్యమున్న ఏఐటీయూసీ 1920 అక్టోబర్ 31న ముంబైలో స్థాపించబడిందని మల్లికార్జున్ తెలిపారు.