బ్లూమింగ్ బడ్స్ ప్రీ స్కూల్ లో వార్షికోత్సవం

5చూసినవారు
బ్లూమింగ్ బడ్స్ ప్రీ స్కూల్ లో వార్షికోత్సవం
శ్రీకాళహస్తి పట్టణంలో బ్లూమింగ్ బడ్స్ ప్రీ స్కూల్ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. చైర్మన్ కె. మనోహర్, ప్రిన్సిపల్ డా. గీతా దేవి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ రామారావు, జీఎస్టీ అధికారి రాఘవులు, హైకోర్టు అడ్వకేట్ రవికుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, పాటలు, నాటికలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అతిథులు చిన్నారుల ప్రతిభను ప్రశంసించారు.

ట్యాగ్స్ :